11 May, 2026 | 2:07 PM

Breaking News

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   ప్రారంభమైన నివాసాలకు గుర్తింపు   •   వెంచర్లో అక్రమాలపై కుల సంఘాల పిర్యాదు   •   యూనియన్ పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించం!   •   మొగిలిపేట క్లస్టర్ గ్రామాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమం   •   ​తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి   •   పంటకోతకు యంత్రాల కొరత.. ఇబ్బందులు పడుతున్న రైతన్న   •   బంగారం కొనుగోళ్లపై దేశప్రజలకు హెచ్చరించిన ప్రధాని మోదీ   •   చంబాలో లోయలో పడిన కారు: ఆరుగురు గుజరాత్‌ పర్యాటకులు మృతి   •   మేడ్చల్‌లో విషాదం: కౌకూర్ చెరువులో అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం   •  

హైదరాబాద్‌లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

01-01-2025 02:34 PM

హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో డ్రంక్ డ్రైవ్ కేసులు(Drunk drive cases) పెరిగాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,184 డ్రంక్ డ్రైవింగ్ కేసులు నమోదు కాగా, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 619 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు(Hyderabad Traffic Police) డిసెంబర్ 31, 2024, మంగళవారం రాత్రి మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై విస్తృత తనిఖీలు నిర్వహించారు. నగరంలోని పలు చెక్‌పోస్టుల వద్ద పోలీసులను గమనించిన పలువురు మద్యం మత్తులో అధికారులను తప్పించుకునేందుకు ప్రయత్నించగా, మరికొందరు అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. కొత్త సంవత్సరాన్ని సందర్భంగా కొంతమంది యువకులు తమ వాహనాలతో విన్యాసాలు చేస్తూ ఆటంకాలు కలిగించారని పోలీసులు తెలిపారు.