బంగారం కొనుగోళ్లపై దేశప్రజలకు హెచ్చరించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: బంగారం(Gold Purchases) సామాన్యుడికి అందనంత దూరానికి చేరింది. బంగారం కొనుగోళ్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi warns) దేశ ప్రజలను హెచ్చరించారు. కొనసాగుతున్న ఇరాన్-అమెరికా యుద్ధం, పెరుగుతున్న ముడిచమురు ధరల వల్ల కలిగిన ఆర్థిక పరిణామాలతో దేశం సతమతమవుతున్న నేపథ్యంలో బంగారం కొనుగోళ్లను మానుకోవడం, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం, ఇంటి నుంచే పనిచేయడం వంటి ఖర్చులను తగ్గించుకునే చర్యలను చేపట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం భారతీయులకు పిలుపునిచ్చారు.
ఒక సంవత్సరం పాటు బంగారం కొనడం మానుకోవాలని ప్రధాని మోదీ భారతీయులను కోరారు. ఇప్పటికే బంగారంపై 6 శాతం దిగుమతి సుంకం విధించినట్లు సూచించారు. ప్రధాని మోదీ వ్యాఖ్యల తర్వాత బంగారంపై దిగుమతి సుంకం పెంచేస్తారని ఊహాగానాలు జోరందుకున్నాయి. భారత్ ఏటా 700-800 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటుందని ప్రధాని వెల్లడించారు. భారత్ లో బంగారం వినియోగంతో దిగుమతుల విలువ 90 శాతానికి పైగా ఉందన్నారు.






