11 May, 2026 | 3:32 PM

ప్రారంభమైన నివాసాలకు గుర్తింపు

11-05-2026 02:05 PM

బోథ్,(విజయక్రాంతి): జనాభాగననలో భాగంగా ఎన్యుమరేటర్లు గ్రామాల బాట పట్టారు. గ్రామాల వారిగా విధుల నిర్వహణకు సోమవారం తరలి వెళ్లారు. బోత్ సోనాల మండలాలలో శిక్షణ పొందిన సిబ్బంది ఆయా గ్రామాలలో వార్డుల వారీగా విధుల నిర్వహణకు వెళ్లారు. ఇంటింటికి వెళ్లి మొదటగా ఇంట్లో కుటుంబ సభ్యుల సంఖ్యను పేర్కొనడంతో పాటు ఇండ్ల గుర్తింపు కార్యక్రమాన్ని చేపట్టారు. సిబ్బంది పనితీరును ఆయా మండలాల తాసిల్దారులు సుభాష్ చంద్ర మల్లేశులు పరిశీలించడం జరిగింది.