11 May, 2026 | 12:59 PM

Breaking News

బంగారం కొనుగోళ్లపై దేశప్రజలకు హెచ్చరించిన ప్రధాని మోదీ   •   చంబాలో లోయలో పడిన కారు: ఆరుగురు గుజరాత్‌ పర్యాటకులు మృతి   •   మేడ్చల్‌లో విషాదం: కౌకూర్ చెరువులో అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం   •   అమ్మ ఒడి కార్యక్రమంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు   •   ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •  

దారుణం.. తల్లి, అక్కాచెల్లెళ్లను హత్య చేసిన యువకుడు

01-01-2025 02:19 PM

లక్నో: ఉత్తరప్రదేశ్ లక్నోలోని ఓ హోటల్‌లో ఒకే కుటుంబానికి(UP Familicide) చెందిన ఐదుగురు వ్యక్తులు శవమై కనిపించారు. తల్లి, నలుగురు చెల్లెళ్లను యువకుడు హతమార్చాడు. లక్నో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కొత్త సంవత్సరం(Happy New Year 2025) సందర్భంగా ఐదుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. "అర్షద్ (24)గా గుర్తించబడిన నిందితుడు తన సొంత కుటుంబానికి చెందిన ఐదుగురిని హత్య చేశాడు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని స్థానిక పోలీసులు వెంటనే  అరెస్టు చేశామని డిప్యూటీ కమిషనర్(Deputy Commissioner) రవీనా త్యాగి తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమని నిందితుడు పోలీసులు చెప్పాడు. మృతులను అస్మా, తొమ్మిదేళ్ల అలియా, 19 ఏళ్ల అలీషా, 16 ఏళ్ల అక్సా ,18 ఏళ్ల రహ్మీన్‌గా గుర్తించారు.

డిసిపి ప్రకారం.. ఆగ్రాకు చెందిన అర్షద్ గృహ వివాదాల కారణంగా  ఈ హత్యలు చేశాడని తెలిపారు. సమీపంలో ఉన్న హోటల్ సిబ్బందిని కూడా విచారిస్తున్నామని, ఏదైనా తాజా సమాచారం వెలుగులోకి వస్తే తక్షణమే మీడియాతో పంచుకుంటామని జాయింట్ పోలీసు కమిషనర్ (Crime, Headquarters) బబ్లూ కుమార్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుల శరీరంపై ఒకరి మణికట్టుపై, మరొకరి మెడపై  గాయాల గుర్తులున్నాయని పోలీసులు తెలిపారు. ఈ హత్య కేసులో అర్షద్ తండ్రి బదర్‌ను కూడా పోలీసులు(Police) అనుమానితుడిగా పేర్కొన్నారు. పరారీలో ఉన్న అతని కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ప్రాథమిక విచారణ ఆధారంగా ఆహారంలో మత్తుమందు ఇచ్చి కుటుంబాన్ని హత్య చేశారని పోలీసులు వెల్లడించారు.