4 July, 2026 | 9:11 AM

మట్టికోట సమరం

26-05-2024 12:05 AM

పారిస్: ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ రంగం సిద్ధమైంది. ఆదివారం ప్రారంభం కానున్న ఈ టోర్నీ రెండు వారాల పాటు క్రీడాభిమానులను అలరించనుంది. పోటీల తొలి రోజు మూడోసీడ్ కార్లోస్ అల్కరాజ్ గార్ఫియా (స్పెయిన్)తో పాటు, ఆరో సీడ్  రూబ్లేవ్, హుర్కాజ్, దిమిత్రోవ్ వంటి స్టార్ ప్లేయర్లు పురుషుల సింగిల్స్ బరిలో ఉన్నారు. ఇక మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) టాప్ సీడ్‌గా బరిలోకి దిగుతుండగా.. నవోమీ ఒసాక (జపాన్), క్రెజికోవా (చెక్ రిపబ్లిక్), సబలెంక, స్టిఫెన్స్, హద్దద్ మైయా, ఓస్టపెంకో తదితరులు తమ అదృష్టాన్ని పరీక్షంచుకోనున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత యువ టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నాగల్‌కు ఫ్రెంచ్ ఓపెన్‌లో కఠినమైన డ్రా ఎదురైంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో 18వ సీడ్ కచనోవ్‌తో నాగల్ తలపడనున్నాడు. గతంలో టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌పై ఓ సెట్ విజయం సాధించి సంచలనం నమోదు చేసిన నాగల్.. కచనోవ్‌పై గెలవాలంటే శక్తికి మించి పోరాడక తప్పదు. నిరుడు ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరిన కచనోవ్‌పై గెలవడం అంత తేలికైన విషయం కాదు.