calender_icon.png 19 July, 2025 | 4:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఒక్క వర్షానికే హైదరాబాద్ ఆగమాగం

19-07-2025 09:15:13 AM

హైదరాబాద్: హైదరాబాద్ ను వరద కష్టాలు వీడడం లేదు. శనివారం కూడా నగరంలో కూడా భారీ వర్షం(Heavy Rain) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం పడిన ఒక్క వర్షానికే హైదరాబాద్ ఆగమాగం అయింది. భారీ వర్షం పడితే నగరంలో ప్రత్యక్ష నరకం కనిపించింది. ఐటీ జోన్ లో అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలను వరద ముంచేసింది. నిన్న రాత్రి కురిసిన వర్షానికి ఇళ్లలోకి నీరు చేరింది. స్థానికులను బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రత్యేకంగా బోట్లు ఏర్పాటు చేశారు.

సికింద్రాబాద్ లోని పైగాకాలనీలో(Paigah Colony) నిన్న కురిసిన వర్షానికి భారీగా వరద(Heavy Flood) చేరింది. ఇళ్లలోకి వరద రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీగా వరద రావడంతో బైకులు కొట్టుకువచ్చాయి. కారులు నీట మునిగాయి. ఇళ్లలోని నీటిని మోటర్ల ద్వారా అధికారులు బయటికి తోడుతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైగా కాలనీ ముంపునకు కారణం ప్యాట్నీ నాలా ఆక్రమణలని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిన్న వరదలో చిక్కుకున్న స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. హైడ్రా, డీఆర్ఎఫ్ బృందాలు(Hydra DRF Teams) బోట్ల సాయంతో సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మోటార్ల సహాయంతో ఇళ్ల యజమానులు వదర నీటిని తొలగిస్తున్నారు. నిన్న కురిసిన భారీ వర్షాలనికి కార్లు, బైకులు కొట్టుకుపోయాని స్థానికులు వాపోయారు. ప్యాట్నీ నాలాలోని హస్మత్ పేట, రసూల్ పురా నాలాల నుంచి భారీగా వరద నీరు చేరింది. ఫ్యాట్నీ నాలా పునరుద్దరణ పనులు వెంటనే చేయాంటూ స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవల నాలా అక్రమణలను హైడ్రా అధికారులు కూల్చివేశారు.