19-07-2025 08:56:19 AM
హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాలానరగ్ పోలీస్ స్టేషన్(Balanagar Police Station) పరిధిలో శనివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన బైకు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని కుత్బుల్లాపూర్ కు చెందిన సురేశ్(35) గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.