29 July, 2026 | 4:00 PM

సుల్తానాబాద్‌లో దంచి కొడుతున్న వర్షం

29-07-2026 03:17 PM

ఆనందంలో అన్నదాతలు

సుల్తానాబాద్,(విజయ క్రాంతి): గత రెండు రోజులుగా పడుతున్న భారీ వర్షాల నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంతోపాటు మండలంలోని  అన్నదాతలు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సుల్తానాబాద్ పట్టణం లోని పలు రహదారుల్లో గుంతల్లో వర్షపు నీరు నిండి పోయాయి. దీంతో పాద చార్లతోపాటు,  వాహనదారులుఇబ్బందులు పడవలసి వస్తుంది. ప్రజా ప్రతినిధులు,  అధికారులు వెంటనే స్పందించి రహదారుల్లో గుంతలు పూడ్చాలని ప్రజలు కోరుతున్నారు.  అలాగే  సుల్తానాబాద్ తోపాటు మండలంలోని గ్రామాల్లోనూ చెరువులు, కుంటలోకి పెద్ద ఎత్తున నీరు వచ్చాయి. గత నెల రోజుల నుండి  వర్షాల కోసం చూస్తున్న రైతులకు ఈ వర్షాలు కొంత ఊరట కల్పించాయి.