29 July, 2026 | 4:03 PM

వర్ని గ్రామాల్లో పార్టిసిపేటరీ రూరల్ అప్రైజలు కార్యక్రమం

29-07-2026 03:20 PM

బోధన్,(విజయక్రాంతి): వర్ని మండలంలోని వర్ని, జకోరా, హుమ్నాపూర్ గ్రామాల్లో జగిత్యాల వ్యవసాయ కళాశాల విద్యార్థులు గ్రామీణ వ్యవసాయ పని అనుభవ కార్యక్రమం (RAWEP)లో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రం (KVK) రుద్రూరు ఆధ్వర్యంలో పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్ (PRA) కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థినులు గ్రామాల పంటలు, పంటల సరళి, సహజ వనరులను చిత్రపటాల రూపంలో రూపొందించి రైతులకు వివరించారు. ఈ సందర్భంగా డా. కె. ఇందుధర్ రెడ్డి ఎల్‌నినో పరిస్థితుల్లో పంటల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి సతీష్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, విద్యార్థినులు, రైతులు పాల్గొన్నారు.