30 July, 2026 | 8:40 PM

దంచి కొట్టింది..!!

30-07-2026 08:09 PM

* మెట్ పల్లి సబ్ డివిజన్ లో భారీ వర్షాలు 

* కూలిన ఇల్లు 

* తెగిన రహదారులు 

* లోతట్టు ప్రాంతాలను సందర్శించిన కలెక్టర్

మెట్ పల్లి,(విజయక్రాంతి): మెట్ పల్లి సబ్ డివిజన్ పరిధిలోని మెట్ పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల పరిధిలో రెండు రోజులుగా భారీ వర్షాలు దంచి కొట్టాయి.లోతట్టు ప్రాంతాలు జలమాయం కాగా పాత ఇల్లు నెలకులాయి.కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. మెట్ పల్లి పట్టణ పరిధిలో భారీ వర్షాలకు మూడు ఇల్లు కులాయి. బాలకిషన్ నగర్, మున్సిపల్ పార్క్ ఏరియాలతో పాటు శివారులోని లోతట్టు ప్రాంతాలు జలమాయం కాగా కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి ఆయా ప్రాంతాల్లో తిరిగి రక్షణ చర్యలు చేపట్టారు.

అలాగే మండలంలోని చెర్ల కొండాపూర్, వెల్లుల్లలో ఒక ఇల్లు పడిపోగా స్థానిక తహసీల్దార్ నీత ఆర్ఐ కాంతయ్య సందర్శించి బాధితులకు తగిన సౌకర్యాలు ఏర్పాటుకై అధికారులను ఆదేశించారు. మల్లాపూర్ మండలంలోని మొగిలిపేటలో ఒక ఇల్లు కూలిపోగా, ఓగులాపూర్ రోడ్డు కల్వర్ట్ తెగడంతో గ్రామానికి రాక పోకలు నిలిచి పోయాయి. ఇబ్రహీంపట్నం మండలంలోని మూలరాంపూర్ శివారులో గోదావరిపై ఉన్న సదర్ మాట్ బ్రిడ్జి మూడు గేట్ లను జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఆదేశాలతో గేట్లను ఎత్తి కిందికి నీటిని వదిలిపెట్టారు. ఇక వేములకుర్తి లో రెండు, తిమ్మాపూర్ లో ఒకటి, గోధుర్ లో ఒకటి మొత్తం మూడు ఇల్లు కూలిపోయాయి.

అలాగే యామపూర్ ఫకీర్ కొండాపూర్ రహదారి కొట్టుకుపోగా రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పాటు ఇబ్రహీంపట్నం వర్షకొండ రహదారిపై రోడ్డు డ్యామ్ పై నుండి వర్షపు నీరు ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పాడు తున్నాయి. మెట్ పల్లి సబ్ డివిజన్ పరిధిలోని అధికారులు అందరు అప్రమత్తం గా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమం ఎస్పీ అశోక్ కుమార్, ఆర్డివో నర్సింహా రావు, డిఎస్పి రాములు, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ తహసీల్దార్ లు వర ప్రసాద్, రాంచందర్ తో పాటు రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.