పేదింటి ఆడబిడ్డ పెళ్లికి సహాయం
• ఉదారత చాటుకున్న మేరుగు నరేష్ గౌడ్
ధర్మపురి,(విజయక్రాంతి): పేదింటి ఆడబిడ్డ పెళ్లికి భక్తాంజనేయ ఆలయ కమిటీ చైర్మెన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేరుగు నరేష్ గౌడ్ సహాయం అందించి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక సర్పంచ్ బండమీది కవిత గోపిల చేతుల మీదుగా మండల కేంద్రానికి చెందిన పుట్టపాక రజిత వివాహానికి మేరుగు నరేష్ గౌడ్ 50 కిలోల బియ్యంను అందజేసి తన ఉదారతను మరోసారి చాటుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సేవే తన లక్ష్యంగా ముందుకు సాగుతానని తెలిపారు. నిరుపేదలకు అండగా నిలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తనవంతుగా సాయం చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన ఈ సందర్బంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు బండమీది గోపి,గుమ్ముల వెంకటేష్,రంగు మారుతి, మూగల శేఖర్, ఉప్పులేటి శ్రావణ్, ఎర్రోళ్ల అంబారీష్,ఎర్రోళ్ల దీపక్, ఎనగందుల నరేష్, వార్డు మెంబర్ లు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




