మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి
పాదయాత్రలో పేదలకు హామీ
ఇందిరమ్మ పథకం కింద ఇండ్ల నిర్మాణం చేసి అందించిన వైనం
సీఎం సార్ కు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు
కామారెడ్డి,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్ష హోదాలో రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో శిథిలావస్థమైన గృహాల్లో ఉన్నవారి ఇండ్లను సందర్శించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి లో హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి లోని బిక్కనూర్ లక్ష్మి, చిట్యాల రాజమణి లకు ఇందిరమ్మ పథకం కింద నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాన్ని శనివారం చేపట్టారు.
ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఫోన్ ద్వారా లబ్ధిదారులతో మాట్లాడారు. ఆనాడు ప్రతిపక్ష హోదాలో కామారెడ్డి జిల్లాలో పర్యటన సందర్భంగా చిన్న మల్లారెడ్డి పాదయాత్రలో శిథిలావస్థలో నివాసం ఉంటున్న వారి వద్దకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కి వస్తే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని మాట ఇచ్చారు. అదే మాట ప్రకారం ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశం చేయించడం ప్రభుత్వం ప్రజల పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శమని అన్నారు. లబ్ధిదారుల తో మంత్రి సీతక్క ఫోన్ ద్వారా మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. చిన్న మల్లారెడ్డి గ్రామంలో నిర్మాణంలో ఉన్న మరికొన్ని ఇందిర ఇండ్లు కూడా త్వరలో పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కలెక్టర్ ఆశిష్ సంగు వాన్, పాల్గొని లబ్ధిదారులకు నిత్యవసర వస్తువులతో కూడిన సామాగ్రితో పాటు బట్టలను అందజేశారు. ప్రతిపక్ష నాయకుడిగా హోదాలో ఉండి పాదయాత్ర చేపట్టి నా సమయంలో ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేర్చడం తమకు సొంతింటి కల కల్పించడం పట్ల లబ్ధిదారులు భిక్కనూరు లక్ష్మి, చిట్యాల రాజమణి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భిక్కనూర్ లక్ష్మీ, చిట్యాల రాజమణిలకు నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లలో గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం ఆదేశాల మేరకు లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు , వస్త్రాలు అందజేశారు. అనంతరం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్కతో ఫోన్ ద్వారా మాట్లాడించి, లబ్ధిదారులకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర సమయంలో కూలిపోయిన ఇళ్లను చూసి చలించిపోయి అధికారంలోకి రాగానే ఇళ్లను నిర్మించి ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని తెలిపారు. మాట నిలబెట్టుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని అన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధు మోహన్, గ్రామ సర్పంచ్ లక్ష్మి, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్, మున్సిపల్ ఛైర్మన్ ఇప్ప ఉమారాణి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.




