24 July, 2026 | 9:18 PM

ఘనంగా గోరింటాకు వేడుకలు

24-07-2026 08:14 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆషాఢ మాసం సందర్భంగా పద్మశాలి మహిళా సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో గోరింటాకు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుని వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు జంజిరాల పుష్పలత, గౌరవ అధ్యక్షురాలు వనమాల జయ, కోశాధికారి అనుమాండ్ల క్రాంతి, ప్రచార కార్యదర్శి గుజ్జ రేవతి, ఇరుకుల్ల పుష్పలత, అనుమాండ్ల సుజాత, అనుమాండ్ల లహరి, పొన్న సంగీత, ఇరుకుల్ల కావ్య, ఇరుకుల్ల అనసూయ, ఆవిడపు రేఖ, రుద్ర రజిని, పొన్న లత, నల్ల విజయ తదితరులు పాల్గొన్నారు.