మానస చిల్డ్రన్స్ హాస్పిటల్ తనిఖీ
ఐదుగురు సభ్యుల కమిటీ నియామకం
సిరిసిల్ల,(విజయక్రాంతి): సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మానస చిల్డ్రన్స్ హాస్పిటల్లో రోగుల నుండి అధిక వైద్య ఛార్జీలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుల తో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ ఆసుపత్రిని తనిఖీ చేసింది. ఆసుపత్రిలో అమలవుతున్న చికిత్స విధానాలు, రోగులకు జారీ చేసిన బిల్లులు, వసూలు చేసిన వైద్య ఛార్జీలు, సంబంధిత రికార్డులు ఇతర పత్రాలను కమిటీ సభ్యులు పరిశీలించారు. అలాగే ఆసుపత్రి యాజమాన్యం నుండి వివరణలు తీసుకొని, అవసరమైన వివరాలను సేకరించారు.పరిశీలన అనంతరం సంబంధిత అంశాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి జిల్లా అధికారులకు సమర్పించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ తనిఖీలో డా. నాగేందర్ బాబు, డిప్యూటీ జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి (డిప్యూటీ డీఎంహెచ్‌ఓ), డా. సౌమ్య, డా. పూర్ణచందర్, డా. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.






