ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను సన్మానించిన మున్సిపల్ చైర్మన్
24-07-2026 08:57 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వైద్యురాలు స్వర్ణ రెడ్డిని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ శుక్రవారం సన్మానించారు. చైర్మన్ మాట్లాడుతూ... గత నెలలో తాము ఆసుపత్రిని సందర్శించి ఎక్స్రే, స్కానింగ్ మిషన్లను అందుబాటులోకి తేవాలని కోరగా స్పందించి సూపర్డెంట్ మిషన్లను బాగు చేయించి రోగులకు అందుబాటులోకి తేవడం అభినందనీయమని, సీజనల్ వ్యాధులతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు తగు వైద్యం అందించాలని ఆమె కోరారు. ఆమె వెంట మున్సిపల్ కౌన్సిలర్లు గుమ్ముల ఆనంద్ కుమార్, నాయకులు ప్రకాష్ గౌడ్ ,మనోజ్, ఉపేందర్ ,సురేష్, భూమన్న ,తదితరులు ఉన్నారు.






