8 May, 2026 | 2:26 AM

త్వరలో ఆపరేషన్ బుడమేరు.. మంత్రి నారాయణ

10-09-2024 04:05 PM

అమరావతి: బుడమేరు బఫర్ జోన్ లో ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆపరేషన్ బుడమేరు చేపట్టటానికి ప్రభుత్వపరంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు సీ ఎం చంద్రబాబాబు నాయుడు చెప్పారని మంత్రి పేర్కొన్నారు. కాగా వరద బాధితులకు ఆహారం, తాగునీరు పంపిణీలో ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామని అన్నారు. పారిశుద్ధ్యం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. వరద బాధితులు పూర్తిగా కోలుకునేవరకు ఆహారం అందించాలని సీఎం ఆదేశించారు. కానీ వైఎస్సార్ నాయకులు వరదలో బురద రాజకీయం చేయడానికి అలవాటు పడ్డారని ఆయన విమర్శించారు.