17 April, 2026 | 3:19 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

హైకోర్టు తీర్పు.. ప్రభుత్వానికి చెంపపెట్టు

19-04-2025 12:00 AM

బీఆర్‌ఎస్ నేత రాకేశ్ రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): గ్రూప్--1 విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి, టీజీపీఎస్సీకి చెంపపెట్టు అని బీఆర్‌ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పు విజయం విద్యార్థులు, వారికి అండగా నిలిచిన బీఆర్‌ఎస్ పార్టీకి దక్కుతుందన్నారు.

గ్రూప్-1 ఫలితాల్లో జరిగిన అవకతవకలపై బీఆర్‌ఎస్ మొదటి నుంచి పోరాటం చేసిందని, తాము ప్రశ్నించినందుకు తనపై పరువునష్టం దావా వేస్తామని టీజీపీఎస్సీ లేఖ పంపిందని తెలిపారు. పరీక్షలు రాసిన అభ్యర్థుల సంఖ్యకు, ఫలితాల సంఖ్యకు మధ్య వ్యత్యాసం ఉందన్నారు.

టీజీపీఎస్సీలో ఏదైనా సైబర్ నేరం జరిగిందా? అన్న అనుమానాలను వ్యక్తం చేశారు. కేసులు వేస్తున్న అభ్యర్థులను కోర్టు ముందే బెదిరిస్తున్నారని ఆరోపించారు. గ్రూప్-1 పరీక్షపై జ్యుడీషియల్ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.