విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యం
19-06-2024 12:51 AM
- భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర
జయశంకర్ భూపాలపల్లి, జూన్ 18(విజయక్రాంతి): పేద విద్యార్దుల జీవితాల్లో వెలుగులు నింపే విద్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి జిల్లా చిట్యాలలో నిర్మించిన కస్తూర్బా గాంధీ పాఠశాల భవనం, అదనపు గదులను మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. భవనం, అదనపు గదులను పరిశీలించిన ఎమ్మెల్యే, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దు స్తులు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాలికల విద్యా సాధికారితకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. కస్తూర్బా విద్యార్థులు పట్టుదలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.






