21 May, 2026 | 1:03 PM

ఎన్ని పొర్లుదండాలు పెట్టినా నిన్ను అధ్యక్షుడిని చేయడు

19-06-2024 12:52 AM
  • మాజీ మంత్రి హరీశ్ రావుపై ప్రభుత్వవిప్ అయిలయ్య సెటైర్లు 
  • బీఆర్‌ఎస్ చేసిన పాపాలను ఒకకొక్కటి కడుక్కుంటూ వస్తున్నాం 
  • రాష్ట్రంలో బీఆర్‌ఎస్ బతికే పరిస్థితి లేదు, బీజేపీలో విలీనం తప్పదు 

హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు చేసిన పాపాలను ఒక్కొక్కటి కడు క్కుంటూ వస్తున్నామని, ఉద్యోగులకు మొ దటి తేదీనే వేతనాలు ఇస్తున్నామని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పేర్కొన్నారు. పదేళ్ల పాలన అంతా అవినీతి, అక్రమాలు, కమీష్లతోనే సాగిందని ఆయన విమర్శించారు.  హరీశ్‌రావు గతంలో తెలంగాణ ప్రజలను మోసం చేసినట్లుగా మళ్లీ చేస్తానంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని  హితవు పలికారు.

మంగళవారం ఆయన అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాటాడారు. ‘నీవు ఎన్ని పొర్లుదండాలు పెట్టినా మీ మామ నిన్ను పార్టీ అధ్యక్షుడిని చేయరు. సలహాలు, సూచనలు చేయండి కాంగ్రెస్ ప్రభుత్వం స్వీక రిస్తుంది’ అని  హరీశ్‌రావుకు అయిలయ్య సూచించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ బతికే పరిస్థితి లేదని, రాబోయే రోజుల్లో బీజేపీలో విలీనం కాకతప్పదన్నా  రు. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. హరీశ్‌రావు మాటలకు ప్రజలు ముక్కుమీద వేలేసుకుంటున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టినా బుద్ధి రావడం లేదంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలు, డీఎ స్సీ, గ్రూప్స్ నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపారు.

సిద్దిపేటలో మెజార్టీ ఎందుకు  తగ్గింది : ప్రభుత్వ విప్ అడ్లూరి 

అసెంబ్లీ ఎన్నికల్లో హరీశ్‌రావు సిద్దిపేటలో 80 వేల మెజార్టీతో గెలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థికి సిద్దిపేటలో గతంలో కంటే ఓట్లు ఎందుకు తగ్గాయో చెప్పాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్  నిలదీశారు. బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని, అందుకే బీఆర్‌ఎస్ ఓట్లన్ని బీజేపీకి వెళ్లాయని ఆరోపించారు. రఘునందన్‌రావు, హరీష్‌రావు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన విషయం అందరికీ తెలుసన్నారు. అబద్ధాలను నిజంగా చెప్పడంలో హరీశ్‌రావు దిట్ట అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో  సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్  అసెంబ్లీ  నియోజక వర్గాల్లో బీఆర్‌ఎస్ మూడో స్థానానికే పరిమితమైందని ఎద్దేవా చేశారు.