1 September, 2026 | 9:41 AM

నల్గొండలో హైటెన్షన్..రామచందర్‌రావు హౌస్ అరెస్ట్

01-09-2026 09:06 AM

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి ఇంటిపై నిన్న దాడి జరిగిన నేపథ్యంలో, ఆయనను పరామర్శించేందుకు రామచందర్‌రావు నేడు నల్గొండ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే పోలీసులు ఆయన పర్యటనను అడ్డుకుని హైదరాబాద్‌ తార్నాకలోని నివాసం వద్ద హౌస్ అరెస్ట్ చేశారు.