షాదీముబారక్, కల్యాణలక్ష్మిలకు బ్రేక్ పడుతుందా..!
01-09-2026 | 08:58am
నేడు హైకోర్టులో విచారణ
హైకోర్టు తీర్పుతో తేలనున్న భవితవ్యం
పథకాలకు కొనసాగింపు ఉంటుందా..?
హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ
హైదరాబాద్: షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాలపై నేడు తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) విచారణ జరగనుంది. ఈ పథకాలకు సంబంధించి సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది. సింగిల్ జడ్జి ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్ పై డివిజన్ బెంచ్ నేడు విచారణ చేపట్టనుంది. దీంతో ప్రభుత్వం తరపున వాదనలు, కోర్టు నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళల వివాహాలకు ఆర్థిక సహాయం అందించే ఈ రెండు పతకాల విషయంలో హైకోర్టు విచారణ కీలకంగా మారింది.
