29 June, 2026 | 12:51 AM

నచ్చాకే వచ్చారా.. వెచ్చంగా హత్తుకో..

29-06-2026 12:10 AM

‘నచ్చాకే వచ్చారా.. వెచ్చంగా హత్తుకో.. గుండెల్లో పెట్టుకో.. కోరింది నిన్నేరా.. నా చెయ్యి పట్టుకో.. చీరల్లే చుట్టుకో..’ అంటూ సాగుతున్న పాటలో హీరో విశాల్, హీరోయిన్ అంజలి మధ్య కెమిస్ట్రీ ఆకట్టు కుంటోంది. ‘నచ్చాకే..’ అనే పేరుతో సంగీత ప్రియుల ముందుకువచ్చిన ఈ తాజా గీతం ‘మకుటం’ సినిమాలోనిది. తన కెరీర్‌లో 35వ సినిమాగా రూపొందిస్తున్న ఈ సినిమాలో హీరోగా నటించటమే కాక దర్శకత్వం తానే వహించారు విశాల్.

రవి అరసు అందించిన కథతో హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోందీ చిత్రం. స్టార్ గ్రాఫ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంజలి, దుషారా విజయన్ హీరోయిన్లు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకొంటున్న ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన రెండో గీతం ‘నచాకే’ను జీవీ ప్రకాశ్‌కుమార్ స్వరపర్చారు. భువనచంద్ర రాసిన ఈ పాటను ప్రభ ఆలపించారు. ఈ సినిమా జూలైలో విడుదల కానుంది.