29 June, 2026 | 1:05 AM

స్టూడెంట్ పొలిటీషియన్ అయితే..?

29-06-2026 12:15 AM

దివంగత నటుడు, రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘స్టూడెంట్’. ఈ సినిమాలో విజేత పరీక్ హీరోయిన్‌గా నటిస్తోంది. జోవికా సినిమాస్, చెరిష్ మీడియా వర్క్స్ బ్యానర్లపై బెల్లం సిద్ధారెడ్డి నిర్మిస్తున్నారు. బాలు తత్వమసి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ టీజర్‌ను ఆదివారం రిలీజ్ చేశారు మేకర్స్. సరదాగా కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేసే స్టూడెంట్ రాజకీయాల్లోకి వస్తే ఆ పొలిటికల్ ఆటను ఎలా మార్చేయగలడనేది ఈ టీజర్‌లో ప్రభావవంతంగా చూపించారు.

లీడర్ లక్షణాలు ఉన్న డేరింగ్ స్టూడెంట్‌గా, యంగ్ పొలిటీషియన్‌గా మేఘాంశ్ తనదైన నటనను కనబర్చాడు. ‘..మనం పాలిటిక్స్‌లో ఉన్నాం, ఇక్కడ ఎథిక్స్ ఉండవు, ఓన్లీ ట్రిక్సే ఉంటాయి’ అంటూ మేఘాంశ్ చెప్పిన డైలాగ్ టీజర్‌కు హైలైట్. శుభలేఖ సుధాకర్, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రేమ్‌చంద్ కంచర్ల; డీవోపీ: శ్రీనివాస్ బెజుగం; స్టంట్స్: రియల్ సతీశ్; ఎడిటర్: నరేశ్ అడుపా, హరిశంకర్ టీఎన్; ఆర్ట్: రాజు చిరుపెల్లి.