21 April, 2026 | 12:51 AM

రాయల్ ఆర్కిడ్ హోటల్స్‌తో హిల్టన్ ఒప్పందం

20-04-2026 11:42 PM

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2026: భారతదేశంలో 125 హాంప్టన్ బై హిల్టన్ హోటళ్లను ప్రారంభించేందుకు, రాయల్ ఆర్కిడ్ హోటల్స్ లిమిటెడ్ యాజమాన్యంలోని రీజెంటా హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒక వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నట్లు హిల్టన్ వెల్లడించింది.

ఈ భాగస్వామ్యం భారతదేశంలో హిల్టన్ యొక్క 'అప్పర్ మిడ్‌స్కేల్' విస్తరణను వేగవంతం చేయనుంది; పెరుగుతున్న దేశీయ పర్యాటకం, విస్తరిస్తున్న మధ్యతరగతి వర్గం నుండి వస్తున్న డిమాండ్, మిడ్-మార్కెట్ విభాగంలో బలమైన అవకాశాలను కల్పిస్తున్నాయి. ఫ్రాంచైజ్ చేయబడిన హోటళ్లు ప్రధానంగా గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణతో సహా పశ్చిమ, దక్షిణ భారతదేశపు మార్కెట్లలో అభివృద్ధి చేయబడతాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేస్తున్న 3,100కు పైగా హాంప్టన్ బై హిల్టన్ ప్రాపర్టీలతో కలుస్తాయి.

హిల్టన్, ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్, అలన్ వాట్స్ మాట్లాడుతూ భారతదేశపు ఆర్థిక వృద్ధి, విస్తరిస్తున్న మధ్యతరగతి మరియు వేగవంతమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటివి దేశపు ప్రయాణ రంగ స్వరూపాన్ని పునర్నిర్మిస్తున్నాయని చెప్పారు. రీజెంటా హోటల్స్ గ్రూప్‌తో తమ కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యం కీలకం కానుందన్నారు.ఇది హిల్టన్ బ్రాండ్‌ల బలం మరియు స్థిరత్వాన్ని కాపాడుకుంటూనే, మా ఫ్రాంచైజ్ విస్తరణను వేగంగా పెంచుకోవడానికి వీలు కల్పిస్తుందని తెలిపారు.

భారతదేశంలో హిల్టన్ విస్తరణ వ్యూహానికి వ్యూహాత్మక ఒప్పందాలు కీలకంగా మారుతున్నాయి. భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న దేశీయ పర్యాటకుల అవసరాలను, అభివృద్ధి చెందుతున్న నగరాలు మరియు కీలక వాణిజ్య కేంద్రాల వ్యాప్తంగా తీర్చడానికి, హాంప్టన్ బై హిల్టన్ వంటి  బ్రాండెడ్ మధ్యస్థ మరియు ఉన్నత-మధ్యస్థ స్థాయి బ్రాండ్‌లకు ఇది బలమైన అవకాశాలను కల్పిస్తోంది.

హిల్టన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మరియు చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ క్రిస్టియన్ చార్నాక్స్ మాట్లాడుతూ తాము ప్రపంచవ్యాప్తంగా తమ  నెట్‌వర్క్ ప్రభావాన్ని విస్తృతం చేస్తూనే ఉన్నందున, హిల్టన్‌కు భారతదేశం ఒక వ్యూహాత్మక దీర్ఘకాలిక వృద్ధి మార్కెట్‌గా నిలుస్తుందన్నారు. ఈ ఒప్పందం హాంప్టన్ బ్రాండ్ యొక్క ప్రపంచవ్యాప్త బలాన్ని చాటిచెబుతోందన్నారు. రాయల్ ఆర్కిడ్ గ్రూప్ వ్యవస్థాపక ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ చందర్ బల్జీ మాట్లాడుతూ భారతదేశంలో హాంప్టన్ బై హిల్టన్‌ను విస్తరించడానికి హిల్టన్‌తో భాగస్వామ్యం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. హిల్టన్‌తో ఈ భాగస్వామ్యం దేశంలోని మధ్యశ్రేణి హాస్పిటాలిటీ విభాగంలో గణనీయమైన వృద్ధిని సాధిస్తుందని ఆకాంభించారు.