7 May, 2026 | 1:28 AM

సీఎం పదవికి హిమంత రాజీనామా

07-05-2026 12:44 AM
  1. గవర్నర్‌కు పత్రం సమర్పణ
  2. ఆమోదించిన గవర్నర్.. అపద్ధర్మ సీఎంగా హిమంత
  3. బీజేపీ నుంచి సీఎంగా ఆయన ఎంపిక లాంఛనమే
  4. గౌహతిలో 12న ప్రమాణ స్వీకార మహోత్సవం

దిస్పూర్, మే ౬: అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు గౌహతిలోని లోక్‌భవన్‌లో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పిం చారు. సీఎంతో పాటు మంత్రివర్గం కూడా రాజీనామా చేసింది. వారి రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేయాలని హిమంత చేసిన ప్రతిపాదనకు గవర్నర్ అంగీకారం తెలిపారు.

కొత్త ప్ర భుత్వం కొలువుదీరేవరకూ అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని హిమంతను గవర్న ర్ కోరారు. మరోవైపు, ఈ నెల ౧౨న రాష్ట్రం లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. గౌహతిలో సీఎంగా హిమంత బిశ్వశర్మ, ఆయన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజర వుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.

బీజేపీ నుంచి సీఎంగా హి మంత ఎంపిక లాంఛనమే అయినప్పటికీ, పార్టీ పెద్దలు జేపీ నడ్డా, నాయబ్ సింగ్ సైనీ అసోం చేరుకుని పరిశీలకులుగా మంతనాలు చేస్తున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమమై, శాసనసభాపక్ష నేతను ఎన్నుకున్న తర్వాత సీఎంను ఎంపిక చేయనున్నారని సమాచారం.