బంగాల్ సీఎంగా సువేందు అధికారి?
9న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం
కోల్‌కతా, మే ౬: బీజేపీ నుంచి బంగాల్ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేత, పార్టీ రాష్ట్ర చీఫ్ సువేందు అధికారి ఎంపిక లాంఛనమే. పార్టీలో అసాధ్యడి (జెయింట్ కిల్లర్)గా పేరు న్న సువేందు సుదీర్ఘ కాలం నుంచి పార్టీకి సే వలందిస్తూ వస్తున్నారు. గతేడాది కోల్‌కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం చోటు చేసుకున్నప్పుడు మమతా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఆయన ముఖ్యపాత్ర పోషించారు.
తృణమూల్ పార్టీకి చెందిన మంత్రుల అవినీతి కుంభకోణాలను వెలికి తీసి ప్రజల ముందు పెట్ట డంలోనూ కీలక పాత్రపోషించారు. ఒకప్పు డు తృణమూల్ కాంగ్రెస్‌లో ముఖ్య నేతగా, మమత కీలక అనుచరుడిగా కొనసాగారు. 2020లో మమత తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని తీసుకువచ్చి పార్టీలో కీలక పదవి ఇవ్వడం, పార్టీలో అభిషేక్ పెత్తనం పెరగడం సువేందుకు రుచించలేదు.
అలాగే, సెఫాలిజిస్టు ప్రశాంత్ కిశోర్ 2021లో కోల్‌కతా వచ్చి పార్టీ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం వంటి అంశాలు నచ్చక సువేం దు పార్టీని వీడారు. వెనువెంటనే బీజేపీలో చేరి ప్రతిపక్ష నేతగా ఎదిగారు. అంతేకాదు, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో తన గురుతుల్యురాలైన మమతపై భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఏదేమైనా, బీజేపీ నుంచి సీఎంగా సువేందు అనేది అనధికారికంగా ఫిక్స్ అయినట్లే.. కాకపోతే ఆ పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రక టించాల్సి ఉందంతే.
రాజీనామాకు మమత నిరాకరణ
ఒకవైపు బీజేపీ ప్రభుత్వం కొలువుదీరేందుకు ఏర్పాట్లు జరుగుతుంటే, సీఎం మమ త మాత్రం తన పదవికి రాజీనామా చేయనని ప్రతిజ్ఞ చేశారు. బీజేపీకి భారీ మెజారిటీ సాధించినప్పటికీ ఆమె సీ ఎం పదవికి రాజీనామా చేయకపోవడం చర్చనీయాంశ మైం ది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆమె ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. ఆమె న్యాయపోరాటా నికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించా రు. మరి.. ఈ అంశంపై గవర్నర్ ఎలా స్పందిస్తారనేది ఉత్కంఠ రేపుతున్నది.






