13 August, 2026 | 10:30 PM

మాధవరావు పల్లి కాలనీలో గుప్తనిధుల తవ్వకాల కలకలం

13-08-2026 09:22 PM

తవ్వకాలు జరుపుతుండగా పట్టుకున్న గ్రామస్థులు

పోలీస్ స్టేషన్ లో నలుగురి అప్పగింత

గణపురం,(విజయక్రాంతి): మండలంలోని మాధవరావుపల్లి కాలనీలో గుప్త నిధుల తవ్వకాల కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే మాధవ రావు పల్లి కాలనీకి చెందిన జిట్టబోయిన సాంబయ్య కు సంబంధించిన కిరాణా షాపు ఉండగా ఆ షాపును పాగాల చక్రపాణి కుమారుడు శ్రావణ్ కుమార్ కు మూడు సంవత్సరాల లీజ్ అగ్రిమెంట్ తో ఇవ్వడం జరిగింది. ఆ స్థలంలో గుప్త నిధులు ఉన్నాయనే ఆలోచనతో చక్రపాణి మరికొందరు గోదావరిఖనికి చెందిన వ్యక్తులు తవ్వకాలు చేపట్టి క్షుద్ర పూజలు చేయగా పరిస్థితిని తెలుసుకున్న గ్రామస్థులు వారిని పట్టుకుని పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. స్థల యజమాని జిట్టబోయిన సాంబయ్య గురువారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ బొరగల అశోక్ మాధవరావుపల్లి కాలనీకి వెళ్లి విచారణ చేపట్టారు.