14 August, 2026 | 10:31 PM

‘పట్టు’ అదిరింది

23-08-2024 12:00 AM

 వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన క్రీడాకారిణులు

 ముగ్గురికి బంగారు పతకాలు

అమ్మన్ (జోర్డాన్): అండర్ వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో భారత క్రీడాకారులు నేహ, అదితికుమారి, పులకిత్ బంగారు పతకాలను గెలుచుకున్నారు. మహిళల 57 కేజీల ఫ్రీ స్టుల్ విభాగంలో నేహ బంగారు పతకం కైవసం చేసుకుంది. జపాన్ క్రీడాకారిణితో జరిగిన ఫైనల్ పోరులో నేహ 10 తేడాతో గెలిచింది. ఇక మహిళల 43 కేజీల ఫ్రీస్టుల్ విభాగంలో భారత్‌కే చెందిన అదితి కుమారి కూడా బంగారు పతకం గెల్చుకుంది.  ఫైనల్ బౌట్‌లో అదితి గ్రీస్ క్రీడాకారిణిపై విజయం సాధించింది. ఇక 65 కేజీల విభాగం ఫైనల్ పోరులో పులకిత్ 6 తేడాతో డారియా మీద విజయం సాధించింది. మానసి లాథర్ కూడా 73 కేజీల విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. మానసి హన్నాతో పోటీ పడనుంది. అంతే కాకుండా ఇండియా రెండు కాంస్య పతకాలను కూడా గెలుచుకుంది. రోనాక్ దహియా, సాయినాథ్ పార్థి కాంస్యాలు గెలుచుకున్నారు.