సెంచరీలతో చెలరేగిన రిజ్వాన్, షకీల్
23-08-2024 12:00 AM
రావల్పిండి: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తున్న పాకిస్తాన్ 448/6 పరుగుల వద్ద తన మొదటి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు షకీల్ (141; 9 ఫోర్లు), రిజ్వాన్ (171 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్సులు) కదం తొక్కడంతో పాకిస్తాన్ 113 ఓవర్లకు 6 వికెట్లు మాత్రమే కోల్పోయి 448 పరుగుల భారీ స్కోరు చేసింది. బంగ్లా బౌలర్లలో ఇస్లాం, మహమూద్ చెరి రెండు, మిరాజ్, షకీబ్ చెరో వికెట్ తీసుకున్నారు. పాక్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ రోజు ముగిసేసరికి వికెట్లేమీ కోల్పోకుండా 27 పరుగులు చేసింది. ఓపెనర్లు హసన్ (11), ఇస్లాం (12) క్రీజులో ఉన్నారు. బంగ్లా 421 పరుగులు వెనుకబడి ఉంది.






