14 August, 2026 | 8:21 PM

Breaking News

సబ్ స్టేషన్ పనులు త్వరలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం   •   వివాహ ఆహ్వాన పత్రిక అందజేత   •   స్మార్ట్ రేషన్ కార్డు లబ్ధిదారులను కార్యక్రమానికి తరలించాలి   •   60 ఏళ్లుగా జీవనాధారంగా ఉన్న మడిగపై వివాదం   •   పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాన్ని పరిశీలించిన ఆర్డీవో   •   నేను ఎలాంటి అసైన్ భూమిని కబ్జా చేయలేదు   •   హనుమాన్ దేవాలయాన్ని అన్ని హంగులతో నిర్మిస్తాం   •   ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఫోరం ఆసిఫాబాద్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఖర్గేకు సంఘీభావంగా ఆలేరులో కాంగ్రెస్ భారీ పాదయాత్ర, సత్యాగ్రహం   •   విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన   •  

రెజ్లింగ్‌లో భారత్‌కు నాలుగు స్వర్ణాలు

23-08-2024 12:30 AM

అమ్మన్ (జోర్డాన్): అండర్ ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు సత్తా చాటారు. మహిళల విభాగంలో నేహ, అదితికుమారి, పులకిత్, మాన్సి లాథర్ స్వర్ణ పతకాలు కైవసం చేసుకొని చరిత్ర సృష్టించారు. 57 కేజీల ఫ్రీ స్టుల్ విభాగంలో నేహ 10 తేడాతో సుయి (జపాన్)పై విజయం సాధించింది. మహిళల 43 కేజీల ఫ్రీస్టుల్ విభాగంలో అదితి కుమారి పసిడి సొంతం చేసుకుంది.

ఫైనల్లో అదితి 7 గ్రీస్‌కు చెందిన మరియాను చిత్తు చేసింది. ఇక 65 కేజీల విభాగం ఫైనల్లో డారియాను ఎదుర్కొన్న పులకిత్ 6 తేడాతో విజయం సాధించింది. 73 కేజీల విభాగం ఫైనల్లో మాన్సి లాథర్ రష్యాకు చెందిన హన్నా పిర్‌సక్యాపై విజయాన్ని సాధించి స్వర్ణం పతకం కొల్లగొట్టింది.  ఇక పురుషుల విభాగంలో రోనక్ దహియా (110 కేజీలు), సాయినాథ్ (51 కేజీలు) కాంస్య పతకాలు సాధించిన సంగతి తెలిసిందే.