రంగుల హోలీ ప్రజల జీవితాల్లో సంతోషం నింపాలి
04-03-2026 04:19 PM
మేడ్చల్ ఆర్టీసీ డిపో మేనేజర్ రామారావు
మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ సర్కిల్ పట్టణంలో ఆర్టీసీ డిపోలో హోలీ పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా డిపో మేనేజర్ రామారావు మాట్లాడుతూ సామాజిక ఐక్యత నిదర్శనగా కుల మత భేదం లేకుండా రంగుల హోలీ మన అందరి జీవితాల్లో సంతోషం నింపాలని ఆయన కోరినట్లు తెలిపారు. రంగుల హోలీ పండుగ సందర్భంగా మేడ్చల్ ఆర్టీసీ డిపో ఉద్యోగులందరికీ డిపో అసిస్టెంట్ మేనేజర్ స్నేహలత కుటుంబ సభ్యులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో విజిలెన్స్ కానిస్టేబుల్ ప్రదీప్ ఆర్టిసి మహిళా కండక్టర్లు.డ్రైవర్ లు సిబ్బంది పాల్గొన్నారు.




