2 June, 2026 | 2:43 AM

సాహసాల స్వయంభూ

02-06-2026 12:00 AM

నిఖిల్ సిద్ధార్థ హీరోగా తెరకెక్కుతున్న భారీ పీరియడ్ యాక్షన్ చిత్రం ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్త, నభా నటేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ‘రా రా ధీవర’ పాట.. ఈ సినిమాపై అంచనాలను పెంచాయి. సోమవారం కథానాయకుడు నిఖిల్ సిద్ధార్థ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ మూవీ నుంచి ఓ మేకింగ్ వీడియోను విడుదల చేశారు.

ఈ ప్రతిష్టాత్మక పీరియడ్ యాక్షన్ డ్రామా కోసం నిఖిల్ చేసిన కఠోర శ్రమను ఈ వీడియోలో చూపించారు. వియత్నాంలో నిపుణుల పర్యవేక్షణలో కత్తియుద్ధం, స్టాఫ్ కాంబాట్, మార్షల్ ఆర్ట్స్ వంటి యుద్ధ విద్యల్లో నిఖిల్ శిక్షణ పొందిన తీరు.. ఆయన సాధన చేస్తున్న దృశ్యాలు కట్టిపడేశాయి.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకొంటున్న ఈ సినిమా త్వరలోనే పాన్-ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి డీవోపీ: సెంథిల్ కుమార్; సంగీతం: రవి బస్రూర్; మాటలు: విజయ్ కామిశెట్టి; పాటలు: రామజోగయ్యశాస్త్రి; పోరాటాలు: కింగ్ సోలమన్, స్టంట్ సిల్వా; ఎడిటర్: తమ్మిరాజు; ప్రొడక్షన్ డిజైన్: ఎం ప్రభాహరన్, రవీందర్.