ప్రేమ.. సస్పెన్స్.. వినోదం సమపాళ్లలో
ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాశ్ హీరోగా నటించిన రెండో చిత్రం ‘కొత్త మలుపు’. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో ఈ సినిమాను తథాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై తాటి బాలకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో భైరవి ఆర్థ్యా కథానాయిక. రఘు బాబు, పృథ్వీరాజ్, ప్రభావతి, మహేందర్, డీడీ శ్రీనివాస్, కిట్టయ్య ముఖ్యపాత్రలను పోషించారు. యశ్వంత్ నాగ్ సంగీతం సమ కూర్చిన ఈ సినిమాకు సుమంత్ కాచర్ల, జవ హర్‌రెడ్డి సినిమాటోగ్రాఫర్లుగా పని చేశారు.
మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. ఈ నేపథ్యంలో సోమవారం ఈ చిత్ర ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నటుడు భాను చందర్, ప్రముఖ గాయని సునీత, నిర్మాత సీ కళ్యాణ్ ముఖ్యఅ తిథులుగా హాజర య్యారు. ఈ ఈవెంట్‌లో గాయని సునీత మాట్లాడుతూ.. “ఆకాశ్ ఎం తో కష్టపడే వ్యక్తి. మంచి స్థాయికి చేరుకో వాలని కోరుకుంటున్నా. దర్శకుడు శివ ప్రేక్షకులకు వినోదాన్ని పంచే కథను తీసుకొ చ్చారు” అన్నారు.
‘మైత్రి మూవీస్ వంటి సంస్థ మద్దతు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంద’ని హీరో ఆకాశ్ చెప్పారు. ‘ఆకాశ్‌తో నా జోడీ, బావ మరదళ్ల పాత్రలు ప్రేక్షకుల ను తప్పకుండా అలరిస్తాయి’ అని హీరోయి న్ భైరవి తెలి పింది. చిత్ర దర్శకుడు శివ మాట్లాడుతూ.. “గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ ప్రేమకథలో ప్రేమ, సస్పె న్స్, వినోదం సమపాళ్లలో ఉంటాయి” అని తెలిపారు. నిర్మాత తాటి బాలరృష్ణ మాట్లా డుతూ.. “పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో రూ పొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అను భూ తినిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ప నులు జరుగుతున్నాయి” అని తెలిపారు.






