1 June, 2026 | 7:02 PM

అగ్ని వీర్ సైనికులకు సన్మానం

01-06-2026 06:22 PM

నిర్మల్,(విజయక్రాంతి): దేశ రక్షణ దళంలో పనిచేయడానికి యువత అగ్ని వీర్ కు ఎంపిక అయిన ముగ్గురు యువకులకు సన్మానం చేశారు. సోన్ మండలంలోని కడ్తాల్ గ్రామానికి చెందిన బర్మ మహేష్, అరిగల లక్ష్మణ్, కొమ్ముల రామ్ చరణ్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ శోభ సత్యనారాయణ గౌడ్ లను ఘనంగా సన్మానించారు. ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులను అభినందించారు. ఎంతో కష్టపడి చదువుకొని సైనికులుగా ఎంపిక కావడం గర్వకారణం అన్నారు.

క్రమశిక్షణతో శిక్షణ పొంది దేశ రక్షణలో భాగస్వాములు కావడం అదృష్టంగా భావించి దేశ సేవకు అంకితభావంతో పనిచేయాలని అన్నారు. ఒకే గ్రామం నుంచి ముగ్గురు యువకులు ఒకేసారి అగ్నివీర్ సైనికులుగా ఎంపిక కావడం గ్రామానికి తమకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. భారత దేశ రక్షణలో కడ్తాల్ గ్రామానికి సముచిత స్థానం లభించేందుకు ముందు వరుసలో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మంజులాపూర్ వైస్ చైర్మన్ బర్మ గంగా దాస్, నాయకులు భూమన్న, అశోక్ యువకుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.