20 May, 2026 | 6:34 PM

బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి ఘనంగా సన్మానం

20-05-2026 05:41 PM

ముకరంపుర,(విజయ క్రాంతి): బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్, యువజన సంఘం అధ్యక్షులు మాదాసు సంజీవ్, బీసీ సంక్షేమ సంఘం పట్టణ ఉపాధ్యక్షులు గుమ్మడి శ్రీనివాస్ తో కలిసి మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన బొమ్మ శ్రీరామ్ చక్రవర్తిని శాలువా, స్వీట్ తినిపించి  సన్మానించారు. అనంతరం వారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల వారీగా  మున్నూరు కాపు విద్యార్థుల కోసం హాస్టల్స్ ఏర్పాటు చేసి, ఉచిత వసతి మరియు భోజన సౌకర్యాలు కల్పించాలని విన్నవించారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపు విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు నగరాల్లో చదువుకోవడానికి సరైన వసతి సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారని విన్నవించారు. దీనికి శ్రీరామ్ చక్రవర్తి  సానుకూలంగా స్పందించారు.