11 August, 2026 | 10:36 AM

ఫాంటసీ ప్రపంచంలో గుర్రపు స్వారీ

19-09-2024 12:48 AM

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వం వహిస్తున్న మూవీ ‘యూఐ’. ఈ సినిమాకు జీ మనోహరన్, కేపీ శ్రీకాంత్ నిర్మాతలుగా, నవీన్ మనోహరన్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల విడుదలైన యూనిక్ టీజర్‌తో వీక్షకులను ఫాంటసీ వరల్డ్‌లోకి తీసుకెళ్లారు ఉపేంద్ర. బుధవారం ఉపేంద్ర బర్త్ డే కావటంతో ఆయనకు విషెస్ తెలియజేస్తూ చిత్రబృందం ఓ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో హార్స్ రైడ్ చేస్తూ కనిపించిన ఉపేంద్ర ఇంటెన్స్ లుక్ అదిరిపోయింది. ఈ మూవీలో ఇంకా రీష్మా నానయ్య లీడ్ యాక్టర్ కాగా, నిధి సుబ్బయ్య, మురళీశర్మ, పి.రవిశంకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్‌లో విడుదల కానున్న ఈ సినిమాకు మ్యూజిక్: అజనీష్ బి లోక్‌నాథ్; సినిమాటోగ్రఫీ: వేణుగోపాల్.