15 June, 2026 | 7:19 PM

Breaking News

అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •  

సంప్రదాయ లుక్‌లో మ్యాడ్ గ్యాంగ్

19-09-2024 12:49 AM

గత ఏడాది విడుదలైన ‘మ్యాడ్’ చిత్రం ప్రేక్షకారణ పొందింది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ వినోదాత్మక సినిమాకు సీక్వెల్‌గా కొన్ని నెలల క్రితం చిత్రబృందం ‘మ్యాడ్ స్క్వేర్’ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనతోనే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో నిర్మాతలు ఈ చిత్రం నుంచి మొదటి గీతాన్ని సెప్టెంబర్ 20న విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. సంప్రదాయ దుస్తుల్లో ఉన్న మ్యాడ్ గ్యాంగ్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో నటీనటుల లుక్ మొదటి భాగానికి పూర్తి భిన్నంగా ఉంది. ఈ మూవీని శ్రీకర స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు రూపొందిస్తున్నాయి. సూర్యదేవర నాగవంశీ సమర్పిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో; కూర్పు: నవీన్ నూలి; ఛాయాగ్రహణం: షామ్‌దత్; నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య; రచన, దర్శకత్వం: కళ్యాణ్ శంకర్.