15 April, 2026 | 12:34 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణాభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలి

26-05-2025 06:07 PM

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు..

హనుమకొండ (విజయక్రాంతి): ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందించేందుకు నిర్మిస్తున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్(Warangal Multi Super Speciality Hospital) నిర్మాణాభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు(State Government Chief Secretary K. Ramakrishna Rao) అన్నారు. సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఆర్ అండ్ బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ తో కలసీ కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఆస్పత్రి ప్రాంగణంలోని సమావేశపు హాలులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమీక్షించారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు మాట్లాడుతూ... ఉత్తర తెలంగాణ ప్రజల వైద్య అవసరాల కోసం నిర్మిస్తున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను వేగవంతంగా పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని అన్నారు. దేశంలోనే అత్యదిక నిధులతో మెరుగైన వైద్య సేవలు, ఆధునిక సదుపాయాలతో నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి పనులను నిర్దేశిత గడువు నాటికి  పూర్తి చేయాలన్నారు. ఉత్తర తెలంగాణకు తలమానికంగా, జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు  నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయించాలనే సంకల్పం తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని పేర్కొన్నారు. ఆసుపత్రి నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలన్నారు. 

వరంగల్ లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఐకానిక్ హాస్పిటల్ అని పేర్కొన్నారు. అనంతరం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్ అండ్ బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ తో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆసుపత్రి భవన  నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు పూర్తయిన పనుల గురించి అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు సీఎస్ కు వివరించారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి మ్యాప్ లను  పరిశీలించారు. 

అంతకుముందు హైదరాబాద్ నుండి వరంగల్ ఎన్ఐటి అతిథి గృహానికి చేరుకున్న  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన రామకృష్ణారావుకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, వరంగల్, హనుమకొండ, జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్య శారద, ప్రావీణ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే పూల మొక్కలను అందించి స్వాగతం పలికారు. ఈ సమీక్షలో వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు  డాక్టర్ సత్య శారద, ప్రావీణ్య, డైరెక్టర్ ఆఫ్ మెడిక ల్ హెల్త్ నరేంద్ర కుమార్, ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్ రాజేశ్వర్ రెడ్డి, ఎస్ ఈ నాగేంద్ర, ఎల్ అండ్ టి ఏరియా మేనేజర్ సెంకట్ రెడ్డి, కె ఎం సి ప్రిన్సిపాల్ రాంకుమార్ రెడ్డి, ఎం జి ఎం సూపరింటెండెంట్ కిషోర్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.