15 April, 2026 | 10:41 AM

ఇంద్రకరణ్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు టీఆర్ఎస్ నేతలకు లేదు..

26-05-2025 06:15 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ప్రదాత, నిర్మల్ అభివృద్ది కోసం నిరంతరం శ్రమించే నిత్య కృషి వలుడు మాజీ మంత్రి వర్యులు మాన్య శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి(Former Minister Sri Indrakaran Reddy)ని విమర్శించే నైతికత బీఆర్ఎస్ పార్టీ నేతలకు లేదని కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ ఎంబరి నారాయణ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ... ఇంద్రకరణ్ రెడ్డికి ఉన్న అనుభవమంత మీ వయసుకు లేదన్నారు. ఉమ్మడి జిల్లాలో తమ ఉనికిని కోల్పోతామన్న భయంతోనే టీఆర్ఎస్ నేతలు ఇంద్రకరణ్ రెడ్డిపై విమర్శిస్తూ మాట్లాడుతున్నారని ఆరోపించారు.

ఇంద్రకరణ్ రెడ్డి ఏ పదవిలో ఉన్న ప్రజల కోసం కష్టపడి పనిచేస్తారని ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ఆయన చేసిన సేవలు ప్రజలు మర్చిపోరని కానీ బీఆర్ఎస్ నేతలు తమ నాయకులపై అసత్యపు వాక్యాలు చేస్తూ మాట్లాడడం ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. గ్రంథాలయ చైర్మన్, జెడ్పీ చైర్మన్, రెండు సార్లు ఎంపీగా, 4 సార్లు ఎమ్మెల్యేగా, రెండు పర్యాయాలు తెలంగాణ రాష్ట్ర మంత్రిగా పని చేసిన సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడిగా దేశములో, రాష్ట్రములో గుర్తింపు పొందిన నాయకుడి గురించి చిల్లర వ్యాఖ్యలు చేయడం నీ రాజకీయ అపరిపక్వత్వానికి నిదర్శనం... అని మళ్ళీ ఇలాంటి చిల్లర వేషాలు, మాటలు మాట్లాడకుండా గౌరవంగా ఉండాలి అని ఒక వేల ప్రవర్తన మార్చుకోకపోతే మీకు, మీ పార్టీ వారికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించడం జరిగింది.