27 July, 2026 | 4:59 PM

వారానికి రెండుసార్లు వసతి గృహాల తనిఖీలు.

27-07-2026 04:27 PM

- జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలను ప్రతి సోమ, శనివారాల్లో జిల్లా అధికారులు తప్పనిసరిగా తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ ఆదేశించారు. విద్యార్థులకు అందుతున్న భోజనం, తాగునీరు, పరిశుభ్రత, మౌలిక సదుపాయాలు, భద్రత, ఆరోగ్య సేవలను క్షుణ్ణంగా పరిశీలించి లోపాలు ఉంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రతి తనిఖీ అనంతరం వివరాలు, ఫొటోలను అధికారిక 'ఎక్స్' ఖాతాలో అప్‌లోడ్ చేసి సంబంధిత ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్‌కు ట్యాగ్ చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్లు చిన్నయ్య, దేవ సహాయం, జిల్లా రెవెన్యూ అధికారి పాండు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.