15 March, 2026 | 5:26 PM

Breaking News

గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •   భిక్కనూర్ పీహెచ్‌సీ పరిధిలో గ్రామ సిబ్బందికి వైద్య శిబిరాలు   •   పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం   •   డ్రగ్స్ టెస్టుకు నేను సిద్ధం   •   మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకి పాజిటివ్   •   ఇండ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి   •   డొమెస్టిక్ సిలిండర్లను వ్యాపారానికి వినియోగిస్తే కఠిన చర్యలు   •   పారిశుధ్య కార్మికులే గ్రామ ప్రగతికి వెన్నెముక   •   అనుమతులు లేని ఇసుక టిప్పర్ పట్టివేత   •  

ఇండ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి

15-03-2026 04:03 PM

జిల్లా కలెక్టర్ కె.హరిత

కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా ఇండ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో చార్జ్ అధికారులు, అదనపు చార్జి అధికారులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి లక్ష్మీనారాయణ లతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులకు నిర్వహిస్తున్న 3 రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే జన గణన, ఇండ్ల గణన కార్యక్రమంలో భాగంగా 2026 సంవత్సరంలో మొదటి విడతలో ఇండ్ల గణన కార్యక్రమాన్ని పూర్తి డిజిటలైజేషన్ పద్ధతిలో స్మార్ట్ ఫోన్ ద్వారా చేపట్టడం జరుగుతుందని, ఇందులో భాగంగా ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి సమాచారాన్ని సేకరించి వివరాలు నమోదుచేసి ఇండ్ల జాబితా రూపొందిస్తారని తెలిపారు.

ఈ ప్రక్రియలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు, చార్జింగ్ అధికారులు నిర్వహిస్తారని, చార్జ్ అధికారులుగా తహసిల్దార్లు, అదనపు చార్జ్ అధికారులుగా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు వ్యవహరిస్తారని తెలిపారు. సెన్సెస్ ఇండెక్స్ పుస్తకాన్ని పూర్తిగా చదివి అవగాహన పెంపొందించుకోవాలని, మాస్టర్ ట్రైనర్లు వివరించే ప్రతి అంశంపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఇండ్ల గణన కార్యక్రమాన్ని నిర్వహించి కార్యచరణ ప్రకారం జాబితా రూపొందించాలని తెలిపారు.

15, 16, 17 రోజులలో నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి అంశాన్ని నేర్చుకుంటూ ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే వెంటనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గణాంక అధికారి గురువయ్య, జిల్లా సెన్సెస్ అధికారులు వినయ్, గంగయ్య, తహసిల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మాస్టర్ ట్రైనర్ ఊసన్న, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.