15 July, 2026 | 7:30 AM

ఆవులను ఎలా అప్పగిస్తారు?

21-06-2024 01:45 AM

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

విజయవాడ, జూన్ 21 (విజయక్రాంతి): పోలీసులు స్వాధీనం చేసుకున్న 195 ఆవులు, ఎద్దులు, దూడలను స్వాధీనం చేసుకున్న తర్వాత వాటి విషయంలో చట్టప్రకారం చర్యలు ఎందుకు తీసుకోలేదని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. ఎవరో వచ్చి వాటి యజమానిని తానేనని చెబితే వాటిని ఎలా అప్పగిస్తారని నిలదీసింది. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని విజయవాడ, భవానీపురం పోలీసులను హెచ్చరించింది.

ఆవులు దూడల యజమానిగా చెబుతున్న ఉమర్ షారూక్ అనే వ్యక్తి వినతి మేరకు ప్రతివాదిగా చేర్చేందుకు అనుమతి ఇచ్చింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తూ జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ జగడం సుమతితో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశాలిచ్చింది. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆవులు, దూడలకు తానే యజమానిని చెబితే పోలీసులు వాటిని ఇచ్చేయడాన్ని సవాల్ చేస్తూ విజయవాడకు చెందిన గోపాలరావు, సురేశ్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం బెంచ్ విచారించింది.