19 March, 2026 | 11:13 AM

అభివృద్ధిపై స్పష్టత ఇవ్వకుండా సిద్దిపేటకు ఎట్లా వస్తావ్

19-03-2026 12:30 AM
  1. పూర్తిస్థాయి రుణమాఫీ చేశాకే నర్మెట్టలో అడుగుపెట్టాలి

సిద్దిపేట జిల్లాలో సీఎం పర్యటనపై బి ఆర్ ఎస్ విమర్శలు 

సిద్దిపేట, మార్చి 18 (విజయక్రాంతి)/నంగునూరు:  నర్మెట్ట గ్రామంలో సగం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదని, ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హా మీని పూర్తిస్థాయిలో నెరవేర్చిన తర్వాతే  అ డుగుపెట్టాలని నంగునూరు మండల మాజీ ఎంపీపీ జప శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బుధవారం మండల పార్టీ అధ్యక్షుడు అనగొని లింగం గౌడ్ అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో వారు  మాట్లాడుతూ..సిద్దిపే ట ప్రాంతానికి ఆయిల్ పామ్ సాగును తీసుకువచ్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్,మాజీ మంత్రి హరీష్ రావులదేనని స్పష్టం చేశారు.

2017లోనే పరిశోధనలు చేయించి, కాళేశ్వరం నీటి లభ్యత పెరిగాక 2022 ఏప్రిల్ 13న హరీష్ రావు,నిరంజన్ రెడ్డిల చేతుల మీదుగా ఈ ఫ్యాక్టరీకి శంకుస్థాపన జరిగిందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు వేముల వెంకట్ రెడ్డి, దువ్వాల మల్లయ్య,రాగుల సారయ్య,ఎడ్ల సోమిరెడ్డి,రమేష్ గౌడ్,నాయకులు సంతోష్ రెడ్డి,రాజిరెడ్డి,కిష్టారెడ్డి,నాగేంద్రం,బెదురు తిరుపతి, అజీజ్,తదితరులు ఉన్నారు.

సిద్దిపేట అభివృద్ధి పనుల రద్దుపై రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలి

సిద్దిపేట నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ హయాంలో మంజూరై, ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిన రూ. 1070 కోట్ల అభివృద్ధి పనులపై స్పష్టత ఇచ్చిన తర్వాతే సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో అడుగు పెట్టాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ డిమాండ్ చేశారు.బుధవారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ,నియోజకవర్గంపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.కోమటిచెరువు శిల్పారామం, రూ. 125 కోట్ల టూరిజం పార్క్ వంటి పనులను నిలిపివేయడం సిద్దిపేట ప్రజలను వంచించడమేనని విమర్శించారు.

ఈ నెల 22న నర్మెట్టలో ప్రారంభించనున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఘనత పూర్తిగా మాజీ మంత్రి హరీష్ రావుదేనని ఆయన స్పష్టం చేశారు.కేసీఆర్, హరీష్ రావు కృషితో రూ. 300 కోట్లు మంజూరై, భూసేకరణ పూర్తయిన ఈ ప్రాజెక్టును ఇప్పుడు కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోవాలని చూడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.జిల్లాలో ఉన్న 14 వేల ఎకరాల ఆయిల్ ఫామ్ సాగులో 12,500 ఎకరాలు బీఆర్‌ఎస్ హయాంలోనే జరిగిందని గుర్తు చేశారు.

ఎన్నికల హామీల వైఫల్యం, రుణమాఫీ అమలుపై ప్రజలకు జవాబు చెప్పకుండా ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి రావడం సరికాదని హితవు పలికారు.ఈ సమావేశంలో నాయకులు మాణిక్య రెడ్డి, జాప శ్రీకాంత్ రెడ్డి, కాముని శ్రీనివాస్, సోమిరెడ్డి, పాపయ్య, రవీందర్ రెడ్డి, కనకరాజు, రమేష్ గౌడ్, కాముని ఉమేష్, ఇట్టబోయిన శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.