3 July, 2026 | 5:16 PM

Breaking News

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •  

ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా!

18-06-2024 12:05 AM

స్నేహితులు ప్రతి ఒక్కరికీ ఉంటారు. స్కూల్, కాలేజ్, ఆఫీస్ ఇలా ప్రతి చోటా ఫ్రెండ్స్ అవుతుంటారు. ఇది చాలా కామన్. మనకున్న ఫ్రెండ్ లీస్ట్‌లో ఒకరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఉంటారు. వీళ్లతోనే ఎక్కువ క్లోజ్‌గా ఉంటారు. ప్రతీదీ చెప్పుకుంటారు. స్నేహం ఎంత ప్రత్యేకమైనా.. కొన్ని విషయాలను మాత్రం చెప్పకూడదంటున్నారు మానసిక నిపుణులు. అవేంటో చూద్దాం..

  1. ముఖ్యంగా మీరెంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినా మీ ఆర్థిక విషయాల గురించి చెప్పకూడదు. మీరు ఏం చేస్తున్నారు.. ఎలా సంపాదిస్తారు వంటి డబ్బుకు సంబంధించిన విషయాలను మాత్రం ఫ్రెండ్స్‌తో చెప్పకూడదు. 
  2. మీకున్న ఆస్తి గురించి మీ చుట్టాలకే కాదు మీ క్లోజ్ ఫ్రెండ్‌కు కూడా చెప్పకూడదు. చాలామంది క్లోజ్ ఫ్రెండ్ కదా అని అన్ని విషయాలను చెప్పేస్తుంటాం. కానీ స్నేహం చెడిపోయిన తర్వాత మీ ఫ్రెండ్ మీ విషయాలను ఎవరికైనా చెప్పే అవకాశం ఉంది. అందుకే మీ ఆస్తుల గురించి ఎవ్వరితోనూ చెప్పకండి.
  3. మీ ఫ్రెండ్ మీకు ఎంత క్లోజ్‌గా ఉన్నా.. మీరెంత బెస్ట్ ఫ్రెండ్స్ అయనా మీ పర్సనల్ ఫోటోలను పంపకండి. ప్రతి వ్యక్తికి వ్యక్తిగత జీవితం ఉంటుంది. దీనిని వీలైనంత సిక్రేట్‌గా ఉంచాలి. ఫోటోలు కూడా ఎన్నో దారుణాలకు ఒడిగడతాయి. 
  4. బెస్ట్ ఫ్రెండ్ అని చాలామంది పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటుంటారు. ఎందుకంటే వారు ఎవ్వరికీ చెప్పరనే నమ్మకం. కానీ అలా అనుకోవడానికి లేదు. మీ భర్త లేదా భార్య గురించి మీ ఫ్రెండ్‌తో అస్సలు మాట్లాడకండి. ఈ విషయం వారికి తెలిస్తే మీ సంబంధం దెబ్బతినొచ్చు. అందుకే వ్యక్తిగత జీవితం గురించి ఫ్రెండ్స్‌కు అన్ని విషయాలను చెప్పకూడదు.