16 July, 2026 | 6:49 PM

ఎంత ముద్దుగున్నదో.. ఎంత లాయిగున్నదో..

13-06-2024 03:25 AM

చాందినీ చౌదరి, వశిష్ట సింహా, భరత్ రాజ్, ఆషురెడ్డి ముఖ్య తారాగణంగా రూపొందిన చిత్రం ‘యేవమ్’. ఈ చిత్రాన్ని ప్రకాశ్ దంతులూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు నవదీప్, పవన్ గోపరాజు నిర్మాతలు. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే హైదరాబాద్‌లో జరిగింది. తాజాగా ఈ చిత్ర కథాగమనంలో ప్రదర్శితమయ్యే ఒగ్గు కథకు సంబంధించిన పాటను బుధవారం మేకర్స్ విడుదల చేశారు. నీలేశ్ మందాలపు సంగీతం అందించిన ఈ పాటను సినిమాలో మిద్దె వినీత్ బృందం ప్రదర్శించింది. ఇంద్రుడు అహల్యను చెరబట్టేందుకు వేసిన ఎత్తుల నేపథ్యంలో సాగిన ఈ లిరికల్ సాంగ్ ద్వారా ప్రతినాయకుడి పాత్రను మేకర్స్ సినీ ప్రియులకు పరిచయం చేశారు. ‘ఎంత ముద్దుగున్నదో.. ఎంత లాయిగున్నదో..’ అంటూ సాగే సాహిత్యం ఆకట్టుకునేలా ఉంది. ‘ఒసేయ్ రాములమ్మ’ సినిమాలోని ‘ఇంతి ఏ ఇంటి జానవే..’ పాట నేపథ్యాన్ని గుర్తు చేసింది.