రాఖీలు ఎలా మొదలయ్యాయి ? సుధామూర్తి కథనంపై నెటిజెన్ల ట్రోలింగ్
భారత దేశం యావత్తు సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీక అయిన రక్షా బంధన్ పర్వదినం సందర్భంగా రాజ్యసభ ఎంపీ సుధామూర్తి సామాజిక మాధ్యమాలలో షేర్ చేసిన వీడియో నెటిజనులలో వైరల్ గా మారి భిన్నాభిప్రాయాలకు దారి తీస్తోంది. రక్షాబంధన్ చరిత్రను వివరిస్తూ అన్నా చెళ్లెల్ల అనుబంధానికి ఉదాహరణగా మొఘల్ చక్రవర్తి హుమాయున్, చిత్తోడ్ గఢ్ రాణి కర్ణావతికి ఆపాదించినందుకు సుధా మూర్తి ని నెటిజెనులు ట్రోల్ చేయడం మొదలెట్టారు. 16వ శతాబ్దంలో చితోడ్ గఢ్ రాణి కర్ణవతి తీవ్ర ప్రమాదంలో చిక్కుకుంది. కానీ రాణీ కర్ణావతి సామ్రాజ్యం చాలా చిన్నది. ఒక రోజు ఆమె రాజ్యంపై దండ యాత్ర జరుగుతుంది. దీంతో ఆమె ప్రమాదంలో పడింది.సహాయం కోసం హుమాయున్‌కు ఒక చిన్న దారాన్ని పంపినప్పటినుంచే ఈ సంప్రదాయం ప్రారంభమైందని మూర్తి పేర్కొన్నారు. కానీ ఆ దారం పంపించడం వెనుక సందేశాన్ని అన్నా చెళ్లల్ల కు గుర్తు అని హూమయూన్ కు స్థానికులు వివరించారు.
శ్రీకృష్ణుడు, ద్రౌపదీ..అన్నా, చెళ్లెల్లు గా..
సోషల్ మీడియా ఎక్స్ వేదికగా నెటిజనులు మూర్తి కథను ఫేక్ అంటూ కొట్టి పారేశారు. కానీ సుధా మూర్తి కి చరిత్ర గురించి కనీస పరిజ్ఞానం లేదని నెటిజన్లు విమర్శించారు. శ్రీకృష్ణుని మణికట్టుకు గాయం అయినపుడు ద్రౌపది తన చీర చెంగు చించి కట్టు కట్టిందని ఆ పౌర్ణమిని రాఖీ పౌర్ణమిగా జరుపుకోవటం ప్రారంభమైందని ఆయన వివరించాడు.






