calender_icon.png 2 November, 2025 | 9:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కవిత మైనార్టీల సహకారం కోరడం ఎంతవరకు సమంజసం

01-11-2025 06:35:44 PM

ముకరంపుర (విజయక్రాంతి): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో నిజామాబాద్ సభలో ముస్లింలను పక్షులతో పోల్చడం, ముస్లింలు పరిందో జైసే హై దానా కిదర్ దాలేతో ఉదర్ జాతే అని వ్యాఖ్యానం చేయడం, అప్పుడు ఆ మాటను వెనక్కి తీసుకోకపోవడం, ఈరోజు మైనారిటీల సహకారం కావాలని కోరడం ఎంతవరకు సమంజసం అని యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీమ్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఆరోజు మైనారిటీలను హింసపరిచి మాట్లాడి ఈరోజు మైనారిటీ రాజకీయం కోసం వాడుకోవడానికి, మీరు రాజకీయ లబ్దికోసమే మాట్లాడుతున్నారని అర్థమైందని పేర్కొన్నారు. గత 10 సంవత్సరాలలో బంగారు తెలంగాణ నినాదంతో ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా, ఇప్పుడు ప్రభుత్వంపై నిందలు వేయడం ఏమిటని, అధికారం కోల్పోయిన తర్వాతనే ప్రజలు గుర్తుకు వచ్చారని, ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని తెలిపారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి గురించి కవిత మాట్లాడకపోవడం, తన ప్రభుత్వంలో చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికే జాగృతి జనబాట తప్ప ఇంకేమీ లేదని పేర్కొన్నారు.