01-11-2025 06:36:47 PM
మండల పశువైద్యాధికారి డాక్టర్ హెచ్ మనోహర్ కృష్ణ కుమార్
మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని కొనసాగుతున్న గాలికుంట వ్యాధి నిరోధక టీకాలను సద్వినియోగం చేసుకోవాలని మండల పశు వైద్యాధికారి డాక్టర్ హెచ్ కృష్ణ కుమార్ తెలిపారు. ఈరోజు గాలి కుంట వ్యాధి నిరోధక టీకాలు గాలి వారి గూడెం, రాము తండా, లీలావతి తండా, గిరిపురం పూసల తండా, చిల్లంచర్ల, లోక్యతండాలలో టీకాల కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలియజేశారు.
అనంతరం డాక్టర్ కృష్ణ కుమార్ మాట్లాడుతూ... గాలికుంట వ్యాధి టీకాలను సద్వినియోగం చేసుకోకపోతే గాలి కుంట వ్యాధి పశువులకు వచ్చే అవకాశం ఉందని ఈ వాది వల్ల కాలు గిట్టలు చేడడం, నోటిలో పొక్కులు ఏర్పడి పగలడం నిరసించి మేత మేయకపోవడం అధిక జ్వరం పాలిచ్చే పశువుల్లో ఉత్పధకత తగ్గటం లాంటి లక్షణాలు కనబడతాయని. ఈ వ్యాధి సోకకముందే తగు జాగ్రత్తలు పడాలని అందుకు గాలి కుంట టీకాలను ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.