9 May, 2026 | 6:48 PM

Breaking News

ధాన్యం అన్‌ లోడింగ్‌ను రెట్టింపు వేగంతో పూర్తి చేయాలి   •   పూసాలలో భక్తి పారవశ్యంతో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర   •   సీఎం సహాయ నిధి చెక్కును పంపిణీ చేసిన బిజెపి నాయకులు   •   కారులో గ్యాస్ నింపుతుండగా పేలిన సిలిండర్   •   ఇండ్ల గణనకు ప్రజలు సహకరించాలి: తాసిల్దార్ శివప్రసాద్ పిలుపు   •   చిన్న కాంట్రాక్టర్ల పొట్టకొట్టే కుట్ర..!   •   తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లీయర్.. విజయ్కు అపాయింట్మెంట్ ఇవ్వని గవర్నర్   •   అగ్ని ప్రమాద బాధితులకు సరుకుల పంపిణీ   •   మక్కల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   మొక్కజొన్నను సత్వరమే రవాణా చర్యలు చేపట్టాలి   •  

శవాన్ని గ్రామానికి తరలించేదెలా?

16-08-2024 01:59 AM
  1. ఆదిలాబాద్ రిమ్స్‌లో చికిత్స పొందుతూ గిరిజనుడి మృతి 
  2. శవాన్ని స్వగ్రామం తీసుకెళ్లేందుకు అష్టకష్టాలు పడిన కుటుంబ సభ్యులు 
  3. క్టర్‌లో శవాన్ని ఉంచి వాగు దాటించిన వైనం

ఆదిలాబాద్, ఆగస్టు 15 (విజయ క్రాంతి): ఆ గ్రామానికి చెందినవారు ఎవరైనా చనిపోతే ఆసుపత్రి నుంచి శవాన్ని గ్రామానికి తీసుకెళ్లాలంటే అష్టకష్టాలు పడాల్సిందే. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ మండలం చందూరి గ్రామం పంచాయతీ అనుబంధ గ్రామం రాజులుగూడకు చెందిన చహకటి చీత్రు కొన్నిరోజులుగా అనారోగ్యంతో ఉండటంతో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించడంతో చీత్రు గురువారం మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని ఆదిలాబాద్ నుంచి చీత్రు సగ్రామానికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు నానా తంటాలు పడ్డారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువస్తుండగా భారీ వర్షం కురవడంతో గ్రామ శివారులోని  వాగు ఉధృతిగా ప్రవహించింది. మృతదేహంతో చాలాసేపు వేచి ఉన్నప్పటికీ నీటి ప్రవాహం తగ్గకపోవడంతో చివరకు ఓ ట్రాక్టర్‌లో మృతదేహాన్ని ఉంచి అతికష్టం మీద వాగు దాటించాల్సి వచ్చింది.