16-08-2024 02:02:02 AM
నలుగురి అరెస్టు, రూ.18వేల నగదు స్వాధీనం
నిజామాబాద్, ఆగస్ట్ 15 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి పీఎస్ పరిధిలో పేకాట స్థావరంపై దాడిచేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు నలుగురు పేకటరాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.18,400 నగదును స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని ఇందల్వాయి పోలీసు స్టేషన్ పరిధిలోని తిర్మన్‌పల్లిలో పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో గురువారం దాడిచేశారు. దాడుల్లో పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకుని వారివద్ద నుంచి 4 సెల్ ఫోన్లు, రూ.18,400 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో సీఐ పురషోత్తం, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది లక్ష్మన్, రాజేశ్వర్, సుదర్శన్, అనీల్‌కుమార్, నర్సయ్య, ఆజం తదితరులు పాల్గొన్నారు.